హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెంగళూరు హైవేపై ప్రమాదాల కలకలం

RR: బెంగళూరు జాతీయ రహదారి విస్తరణ పనులు అసంపూర్తిగా ఉండటంతో ప్రమాదాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది తొమ్మిది నెలల్లో 30 ప్రమాదాల్లో 35 మంది మృతి చెందారు. శంషాబాద్-తొండుపల్లి-కొత్తూరు మధ్య 12 కి.మీ. మేర పనులు నిలిచిపోయాయి. పాత కాంట్రాక్టు రద్దు చేసి రూ.280 కోట్లతో కొత్త టెండర్లు పిలిచారు.