KMM: కొణిజర్ల మండలం, పల్లిపాడు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైరా శాంతినగర్‌కు చెందిన కూరగాయల వ్యాపారి మాడుపాటి నరసింహారావు మృతి చెందారు. ఖమ్మం నుంచి బైక్‌పై తిరిగి వస్తుండగా స్వర్ణభారతి కోల్డ్ స్టోరేజ్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వాహనం కోసం దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి


