హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నేటి నుంచి పట్టభద్రుల ఓటు నమోదు'

JN: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. నవంబరు 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హులు ఫారమ్-18ను పూర్తి చేసి ERO, AERO, తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలి. గతంలో ఓటరుగా ఉన్నప్పటికీ మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 2026 నవంబరు 1 నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు నిండినవారే అర్హులని పేర్కొన్నారు.