హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైలు కింద పడి యువతి మృతి

VKB: తాండూరు-మంతట్టి రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం రైలు కింద పడి ఓ యువతి మృతి చెందింది. మృతురాలిని యాలాల మండలం బెనూర్‌కు చెందిన చిలక సోనీగా పోలీసులు గుర్తించారు. శనివారం తండ్రితో కలిసి తాండూరుకు వచ్చిన ఆమె బస్టాండ్ నుంచి అదృశ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మరుసటి రోజే రైలు పట్టాలపై మృతదేహం లభ్యమైంది.