VKB: బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా చేపట్టిన పాదయాత్రలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రైతులతో కలిసి పొలం దున్ని వ్యవసాయంపై తనకున్న ఆసక్తిని చాటుకున్నారు. ఆదివారం దుద్యాల్ మండలం హస్నాబాద్ మీదుగా సాగిన యాత్రలో రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీసీలంతా ఐక్యంగా ఉంటేనే న్యాయం జరుగుతుందని అన్నారు. యాత్ర మద్దూర్ వైపు కొనసాగుతోంది.
తెలంగాణ
రైతులతో కలిసి పొలం దున్నిన మల్లన్న


