హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైలు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ మృతి

NLG: చిట్యాల, 10వ వార్డుకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ తోటకూరి మల్లయ్య 60 రైలు ప్రమాదంలో మృతి చెందిన ఘటన జరిగింది. రైలు పట్టాల వెంబడి నడుచుకుంటూ వెళుతుండగా శనివారం సాయంత్రం పల్నాడు ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని మృతి చెందాడని నల్గొండ రైల్వే ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఆదివారం నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం ఆదివారం అంత్యక్రియలు జరిగాయి.