KNR: హుజూరాబాద్ మండలం సిరిసపల్లిలో కుటుంబ కలహాల నేపథ్యంలో నిన్న భర్త భార్యపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. చెల్పూరు వనజ ఇంట్లో పని చేస్తుండగా భర్త ముత్తయ్య వెనుక నుంచి తలపై గొడ్డలితో కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. వనజ ఫిర్యాదుతో నిందితుడిపై సెక్షన్ 109 కింద కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు.
తెలంగాణ
భార్యపై భర్త గొడ్డలితో దాడి


