PDPL: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్‌హౌస్ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి జలాల తరలింపు కొనసాగుతోంది. నాలుగు బాహుబలి మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌస్ మీదుగా మిడ్ మానేరు రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తున్నారు. ప్రాజెక్టులో నీటి లభ్యతను బట్టి తరలింపు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
తెలంగాణ
నంది పంప్‌హౌస్ నుంచి జలాల ఎత్తిపోత


