హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరి: DAO

SRD: రైతు రిజిస్ట్రేషన్ (ఫార్మర్ ఐడీ) కోసం జిల్లాలోని రైతులు సెప్టెంబర్ 30లోగా వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ సూచించారు. సమీప రైతు వేదికలోని ఏఈఓను లేదా మీసేవ కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు. ఆధార్, భూమి పాస్‌బుక్, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ ఫోన్ వెంట తీసుకెళ్లాలని సూచించారు.