హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడిగడ్డకు భారీగా వరద ప్రవాహం

BHPL: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కు వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. ఉదయం 6 గంటల వరకు బ్యారేజ్‌కు 1,08,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో బ్యారేజ్‌లోని 85 గేట్లను ఎత్తి, అదే స్థాయిలో 1,08,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్‌ నీటిమట్టం 90.50 మీటర్లుగా నమోదు అయిందని అధికారులు వెల్లడించారు.