హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడ్చల్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం

MDCL: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని NSR కాలేజీ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అర్ధరాత్రి సమయంలో సదరు వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలి పడి ఉండొచ్చని ఎస్సై మహేందర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడిని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కృష్ణచంద్ర (37)గా గుర్తించారు.