హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొబైల్ ఫిల్మ్ మేకింగ్‌పై వర్క్‌షాప్

RR: టాస్క్ కార్యాలయంలో శనివారం మొబైల్ ఫిల్మ్ మేకింగ్, సినిమాటోగ్రఫీపై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. వివిధ కళాశాలలకు చెందిన 56 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఫ్రేమింగ్, లైటింగ్, కెమెరా టెక్నిక్స్, విజువల్ స్టోరీ టెల్లింగ్‌పై శిక్షణ ఇచ్చారు. టాస్క్ CEO సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి విద్యార్థులు సృజనాత్మక నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించి ధృవపత్రాలు అందించారు.