హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొమురవెల్లి క్షేత్రంలో స్వామివారి ప్రత్యేక పూజలు

SDPT: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రంలో సోమవారం భక్తిపరవశం విరబూసింది. శోభాయమానమైన విశేష అలంకరణలో మల్లన్న స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. కోనేటి స్నానాల అనంతరం స్వామివారికి పట్నాలు, ఒడిబియ్యం సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు అన్ని రకాల సమగ్ర ఏర్పాట్లు గావించారు.