హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెస్టారెంట్లపై చర్యలు.. మళ్లీ ఓపెన్

HYD: తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు రెండు రోజుల క్రితం పలు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి, నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో FSSAI లైసెన్సులు రద్దు చేసి మూసివేయాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే గచ్చిబౌలిలోని అంటెరా కిచెన్ & బార్, చార్మినార్‌లోని షాదాబ్ సహా కొన్ని రెస్టారెంట్లు తిరిగి తెరుచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.