హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్‌కు 1,534 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో సోమవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1,080.60 అడుగులుగా నమోదైంది. నీటి నిల్వ 46.654 టీఎంసీలుగా ఉంది. గత 24 గంటల్లో 1,534 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, అంతే స్థాయిలో ఔట్‌ఫ్లో నమోదైంది. ప్రస్తుతం లక్ష్మీ కాలువకు 215, సరస్వతి కాలువకు 417, మిషన్ భగీరథకు 231, కేఎంసీ/జనరేషన్‌కు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.