హైదరాబాద్: 28°C
తెలంగాణ

అపార్ట్‌మెంట్‌లో చెడ్డీ గ్యాంగ్ కలకలం

MDCL: మణికొండలోని ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లో తెల్లవారుజామున దుండగులు చోరీకి తెగబడ్డారు. ఆదివారం 3:20 గంటలకు ఆరుగురు వ్యక్తులు చెరువు వైపు ఫెన్సింగ్‌ను కత్తిరించి అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించారు. సి-బ్లాక్‌లోని ఫ్లాట్‌లో చోరీకి యత్నించి, అడ్డుకున్న మహిళపై ఆయుధాలతో దాడికి ప్రయత్నించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.