హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాలకు పెరిగిన వరద ప్రవాహం

WNP: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 6,000 క్యూసెక్కులకు పైగా వరద కొనసాగుతోందని ప్రాజెక్టు అధికారి సుదర్శన్‌ యాదవ్‌ తెలిపారు. ప్రాజెక్టులో 5.691 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.430 మీటర్లుగా ఉందన్నారు. అవుట్‌ఫ్లో 6,079 క్యూసెక్కులుగా కొనసాగుతోందని తెలిపారు.