హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏడుపాయల వన దుర్గమ్మకు విశేష పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల క్షేత్రంలో సోమవారం మన దుర్గమ్మకు విశేష పూజలు నిర్వహించారు. భాద్రపద మాసం, శుక్లపక్షం, విదియ తిథిని పురస్కరించుకొని మూలవిరాట్ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. పట్టు వస్త్రాలు పలు ద్రవ్యాలు సమర్పించి, సుగంధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.