VKB: ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. వార్తల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిజాయతీగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు వాస్తవాలు చేరేలా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
తెలంగాణ
నిజాయతీగా వార్తలు రాయాలి: మాజీ ఎమ్మెల్యే


