హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు HCUలో విద్యార్థి ఎన్నికల పోలింగ్

HYD: హెచ్‌సీయూలో విద్యార్థి సంఘం ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. నేడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్యాంపస్‌లోని అన్ని విభాగాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ విభాగంలోనే ఓటు వేసే అవకాశం కల్పించారు. రేపు ఉదయం ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు.