హైదరాబాద్: 28°C
తెలంగాణ

అట్టహాసంగా పర్యాటక దినోత్సవ వేడుకలు

KMM: లకారం ట్యాంక్ బండ్‌లో అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. జిల్లా అటవీ అధికారి అనూజ్ అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేసి మాట్లాడుతూ.. ఖమ్మం ఖిల్లా, నేలకొండపల్లి బౌద్ధ స్తూపం, పాలేరు రిజర్వాయర్లు పర్యాటకులకు ఆహ్లాదం ఇచ్చే విధంగా ఉన్నాయన్నారు.