BHPL: మల్హర్ రావు మండలం రుద్రారం చెందిన ఆరాధన (18) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి చంద్రయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్‌కుమార్ తెలిపారు.
తెలంగాణ
అనారోగ్యంతో యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య


