హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఉల్లాస్ పరీక్ష విజయవంతం

ADB: జిల్లాలో వయోజన నిరక్షరాస్యుల కోసం 'ఉల్లాస్ నవభారత సాక్షరత' పునాది అక్షరాస్యత పరీక్ష ఆదివారం విజయవంతంగా ముగిసింది. 20 మండలాల్లోని 490 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలో 86.88 శాతం హాజరు నమోదయిందని జిల్లా వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రాథమిక పఠనం, గణిత నైపుణ్యాలను అంచనా వేసేందుకు ఈ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు.