హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేజీబీవీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి: ఎంపీ

MDK: మెదక్ కేజీబీవీని తనిఖీ చేసిన ఎంపీ రఘునందన్‌ రావు, అక్కడ 10-15 ఏళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. తక్కువ వేతనాలతో ప్రభుత్వం వారితో వెట్టిచాకిరీ చేయిస్తోందని విమర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతులు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.