హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంగారెడ్డి పెద్ద చెరువులో విగ్రహాల తొలగింపు

SRD: జిల్లా ఓల్డ్ బస్టాండ్ మునిసిపల్ పెద్ద చెరువులో నిమజ్జనం చేసిన గణపతి విగ్రహాల ఆకృతులను అధికారులు తక్షణమే తొలగిస్తున్నారు. కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబ్బంది చెరువును వేగంగా శుభ్రం చేస్తున్నారు. కాలుష్యం కాకుండా అధికారులు తీసుకుంటున్న ఈ తక్షణ చర్యల పట్ల స్థానిక ప్రజలు పూర్తి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.