హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాముకాటుతో మహిళ మృతి

WGL: ఖిలావరంగల్ మండలం జక్కలొద్ది గ్రామానికి చెందిన సమంత (35) పాముకాటుతో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. శనివారం రాత్రి ఇంటి ఆవరణలోని స్నానపు గదికి వెళ్లిన ఆమెను పాము కాటేసింది. అపస్మారక స్థితిలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. సమంత మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.