హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు దహెగాం మండల స్థాయి సమావేశం

ASF: దహెగాం మండలస్థాయి సమావేశం సోమవారం నిర్వహిస్తున్నట్లు MPDO సస్రుల్లాఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. మండల సర్పంచుల, అధికారుల భాగస్వామ్యంతో మండల ప్రజాపరిషత్ సమావేశాన్ని ప్రత్యేకాధికారి అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుందన్నారు. మండలస్థాయి అధికారులు తమ శాఖలకు సంబంధించి ప్రగతి నివేదికలతో హాజరు కావాలన్నారు. సర్పంచులు సకాలంలో హాజరు కావాలని కోరారు.