హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆశ వర్కర్‌లకు 18 వేల వేతనాన్ని వెంటనే అమలు చేయాలి'

NLG: ఆశ వర్కర్లకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా రూ. 18 వేల వేతనం వెంటనే అమలు చేయాలని, సీఐటీయూ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో, నల్లగొండ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.