NGKL: హనుమకొండలో ఈ నెల 26, 27న నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అచ్చంపేట మైనారిటీ పాఠశాల 9వ తరగతి విద్యార్థి యువరాజ్ ప్రతిభ చాటాడు. అండర్-14లో 60 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, హైజంప్‌లో పాల్గొన్నాడు. లాంగ్‌జంప్‌లో కాంస్య పతకం సాధించినట్లు ప్రిన్సిపల్ జే.రాములు తెలిపారు. పాఠశాల బృందం యువరాజ్‌ను అభినందించింది.
తెలంగాణ
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో యువరాజ్ ప్రతిభ


