MNCL: భీమారం బస్టాండ్ సమీపంలో పిచ్చికుక్క పలువురిపై దాడి చేసింది. ఈ ఘటనలో మారం రవి, కోడిపే ఎర్రయ్య, కోడిపే అశ్రుతానంద్, కుమ్మరి అశోక్ గాయపడ్డారు. బాధితులు చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందారు. ఇటీవల కోతులు, కుక్కలు దాడులు చేస్తూ పలువురిని గాయపరుస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
పిచ్చికుక్క దాడి.. నలుగురికి గాయాలు


