హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు రిజిస్ట్రేషన్‌పై ఏడీఏ సూచన

SRD: ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సబ్సిడీలు, పంటల కొనుగోళ్లు, ఎరువులు, పంట రుణాలు తదితర సేవలను సులభంగా పొందేందుకు రైతు రిజిస్ట్రేషన్‌ (ఫార్మర్‌ ఐడీ) కీలకమని ఖేడ్‌ ఇంచార్జ్‌ ఏడీఏ ప్రవీణ్‌ చారి తెలిపారు. రైతులందరూ ఈ నెల 30లోగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌తో రైతుల భూములు, వ్యవసాయ కార్యకలాపాల వివరాలు డిజిటల్‌గా నమోదవుతాయని పేర్కొన్నారు.