JGL: కోరుట్ల సీపీఐ కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ముక్రమ్ మాట్లాడుతూ.. బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసి సిబ్బంది కొరతను పరిష్కరించాలన్నారు. ఉద్యోగులపై పని భారం, లక్ష్యాల ఒత్తిడి తగ్గించాలని సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయడంతో పాటు ఉద్యోగుల హక్కులు కాపాడాలన్నారు.
తెలంగాణ
'ఐదు రోజుల పనివిధానం అమలు చేయాలి'


