హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూనియర్ బాలికల కబడ్డీ జట్టు ఎంపిక

KNR: జిల్లా జూనియర్ బాలికల కబడ్డీ జట్టు ఎంపికకు ఈ నెల 29న వేములవాడ కాలేజీ గ్రౌండ్ వేదిక కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ట్రయల్స్ ప్రారంభమవుతాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సింగారపు తిరుపతి తెలిపారు. 65 కిలోలలోపు బరువు, 2006 నవంబర్ 5న లేదా ఆ తర్వాత జన్మించిన బాలికలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు సకాలంలో హాజరు కావాలని సూచించారు.