హైదరాబాద్: 28°C
తెలంగాణ

పద్మశాలి సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

KNR: జమ్మికుంట పట్టణ పద్మశాలి సేవా సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా అరకాల వీరేశలింగం ఎన్నికయ్యారు. ఆయనతో పాటు డైరెక్టర్లుగా ఎన్నికైన వారిని మున్సిపల్ చైర్మన్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. 12వ వార్డులోని పద్మశాలి కుటుంబాలతో తనకు ఎంతోకాలంగా అనుబంధం ఉందని తెలిపారు. నూతన కార్యవర్గం సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.