TG: స్వతంత్ర భారతదేశంలో సన్న బియ్యం పంపిణీ చేసి తెలంగాణ చరిత్ర సృష్టించిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించడంతో పాటు రైతులకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని చెప్పారు. అలాగే, గత ప్రభుత్వం ప్రజలకు దొడ్డు బియ్యం పంపిణీ చేసిందని విమర్శించారు.
వార్తలు
సన్న బియ్యం పంపిణీతో చరిత్ర సృష్టించాం: మంత్రి


