TG: బీఆర్ఎస్ పార్టీపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. 20 ఏళ్లయినా రాష్ట్రంలో BRS మళ్లీ అధికారంలోకి రాదన్నారు. తెలంగాణ అస్తిత్వం అంటే అమరవీరులు మాత్రమేనని, కేసీఆర్ కాదన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ఎక్కడ తలకాయ పెట్టినా ఉపయోగం ఉండదని చెప్పారు. తెలంగాణ అంటే తామే అన్న కల్వకుంట్ల కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి పాతాళానికి తొక్కారని వ్యాఖ్యానించారు.
వార్తలు
20 ఏళ్లయినా BRS అధికారంలోకి రాదు: అద్దంకి


