హైదరాబాద్: 28°C
వార్తలు

టీడీపీ అంటేనే బీసీల పార్టీ: ఎంపీ కలిశెట్టి

AP: టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని ఎంపీ కలిశెట్టి అన్నారు. బీసీలను చట్టసభలకు పంపిన ఘనత టీడీపీకే దక్కుతుందని తెలిపారు. గత వైసీపీ పాలనలో బీసీ వర్గాలను తీవ్రంగా అణగదొక్కారని విమర్శించారు. బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించిన చరిత్ర వైసీపీదేనని మండిపడ్డారు. పల్లా, కళా వెంకటరావు, అచ్చెన్నాయుడు లాంటి బీసీ నేతలను పార్టీ అధ్యక్షులను చేసిన ఘనత టీడీపీకే సొంతమని చెప్పారు.