హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీలోని నూరాని మసీదులో నిర్వహించిన జష్నే గౌసుల్ వరా వేడుకల్లో ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదివారం రాత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌస్ పాక్ జెండాను ఎగురవేసి కార్యక్రమంలో పాల్గొన్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు రమేష్, టీడీపీ నేతలు పాల్గొన్నారు.