హైదరాబాద్: 28°C
వార్తలు

కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో చిక్కుకున్న భక్తులు

ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గౌరీకుండ్ కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో కొండచరియలు విరిగి పడ్డాయి. రహదారిపై అడ్డంగా కొండచరియలు పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఈ మార్గంలో పలువురు తెలుగు యాత్రికులు చిక్కుకుపోయారు. వీరంతో తిరుగు పయనం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ మార్గంలో మొత్తం 10 వేలకు పైగా భక్తులు చిక్కున్నట్లు సమాచారం.