హైదరాబాద్: 28°C
వార్తలు

'విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి'

తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఏపీ విద్యుత్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కాంట్రాక్ట్ కార్మికుల చైతన్య యాత్ర సాగింది. కార్మికులను రెగ్యులర్ చేసి రూ.48 వేల జీతం ఇవ్వాలని, PRC కమిటీ వేయాలని, జేఎల్‌ఎంలను ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు. వెంకటగిరిలో ప్రారంభమైన బైక్ ర్యాలీ నాయుడుపేట మీదుగా తిరుపతికి చేరింది. ర్యాలీలో ముజఫర్ అహ్మద్, సుమన్, నాదముని రెడ్డి పాల్గొన్నారు.