హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షాలు.. మూడు రోజుల్లో 56 మంది మృతి

యూపీని వర్షాలు వణికిస్తున్నాయి. మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 56 మంది మృతి చెందారు. మరో 46 మంది గాయపడ్డారు. తుఫాన్ కారణంగా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు రావడంతో 1000కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలు ఇళ్లు నీట మునిగాయి. వెంటనే రంగంలోకి దిగిన NDRF బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.