హైదరాబాద్: 28°C
వార్తలు

సహనం కోల్పోయిన మంత్రి.. ఎమ్మెల్యే సహాయకుడిపై దాడి

ఢిల్లీ మంత్రి పర్వేశ్ వర్మ సహనం కోల్పోయారు. ప్రతిపక్ష ఆప్ ఎమ్మెల్యే జర్నాలి సింగ్ ఎదుటే.. ఆయన వ్యక్తిగత సహాయకుడి చెంప చెళ్లుమనిపించారు. 15 రోజుల క్రితం వేసిన రోడ్డు నాణ్యత గురించి ఆప్ ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీనిని ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు ఫోన్‌లో రికార్డు చేస్తున్నాడు. దీంతో సహనం కోల్పోయిన మంత్రి ఫోన్‌ను పక్కకు నెట్టేసి.. అతడి చెంపపై కొట్టారు.