ఆన్‌లైన్ గేమింగ్ మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న గేమ్స్ క్రాఫ్ట్ సంస్థ ఈడీ షాక్ ఇచ్చింది. ఇది వరకే రూ.2,400 కోట్లకుపైగా ఆస్తుల్ని జప్తు చేసిన ఈడీ.. తాజాగా మరో రూ.442 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఆన్‌లైన్ రియల్ మనీ గేమ్స్ నిర్వహిస్తూ.. తద్వారా సంస్థ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ ఆరోపించింది. ఈ ఘటనపై మరో కేసు నమోదు చేసి విచారిస్తుంది.
వార్తలు
గేమ్ క్రాఫ్ట్ సంస్థకు ఈడీ షాక్


