హైదరాబాద్: 28°C
వార్తలు

ఉద్యోగులను బేషరతుగా విడుదల చేయాలి: సుధాకర్‌బాబు

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు స్పందించారు. అరెస్టైన ఉద్యోగులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల డిమాండ్లు సహేతుకమైనవని పేర్కొన్నారు. ధర్నా చేస్తున్న ఉద్యోగులపై లాఠీచార్జ్ చేయడం అన్యాయమని విమర్శించారు. పోలీసు చర్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు.