హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ దేశాల సరసన భారత్‌ను మోదీ నిలిపారు: అమిత్ షా

దేశంలో హైడ్రోజన్‌తో నడిచే తొలి రైలును ప్రధాని మోదీ ప్రారంభించారని కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రపంచంలో హైడ్రోజన్‌తో నడిచే రైలు సాంకేతికత కలిగిన 4 దేశాల సరసన భారత్‌ను నిలిపారని కొనియాడారు. ముంబై నుంచి వడోదర వరకు తొలి లాంగ్ డబుల్ స్టాక్ కంటైనర్ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిందని.. 11 వేల కి.మీ రైలు కారిడార్‌ను 4 ట్రాకులుగా మార్చుతున్నట్లు చెప్పారు.