హైదరాబాద్: 28°C
వార్తలు

చనిపోయాడనుకున్న వ్యక్తి బతికొచ్చాడు

TG: సిరిసిల్ల జిల్లా సనుగుల గ్రామంలో అరుదైన ఘటన జరిగింది. అనారోగ్యంతో కరీంనగర్ ఆస్పత్రిలో చేరిన చీకటి శంకరయ్య మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో కుటుంబీకులు మృతదేహాన్ని అంబులెన్స్‌లో గ్రామానికి తరలిస్తుండగా.. జోగాపూర్ సమీపంలో శంకరయ్య అకస్మాత్తుగా లేచి కూర్చున్నాడు. వెంటనే అతడిని వేములవాడ ఆస్పత్రికి తరలించగా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.