హైదరాబాద్: 28°C
వార్తలు

‘6 నుంచి 190కి.. అరుదైన జీవికి పునర్జన్మ’

'మన్ కీ బాత్'లో PM మోదీ అసోంలో 'పిగ్మీ హాగ్' సంరక్షణ గురించి మాట్లాడారు. అంతరించిపోతున్న ఈ అరుదైన జీవులను రక్షించేందుకు కేవలం ఆరు పిగ్మీ హాగ్స్‌తో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. వాటికి అనువైన వాతావరణం కోసం గడ్డిభూములను అభివృద్ధి చేసి తిరిగి అడవుల్లోకి వదిలారన్నారు. ఈ అద్భుత చొరవతో నేడు వాటి సంఖ్య 190కి పైగా పెరిగిందని మోదీ హర్షం వ్యక్తం చేశారు.