హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: సుద్దులంలో ‘అమ్మకు అక్షరమాల’ పరీక్ష

NZB: డిచ్‌పల్లి మండలం సుద్దులం గ్రామంలో ఉల్లాస్–నవభారత అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా ఆదివారం అమ్మకు అక్షరమాల పరీక్ష నిర్వహించారు. గ్రామ సర్పంచ్ తినేటి హేమలత ఆధ్వర్యంలో మహిళలకు పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ హేమలత మాట్లాడుతూ.. మహిళలు అక్షరాస్యత సాధించడం ద్వారా తమ కుటుంబాలతో పాటు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించగలరన్నారు.