హైదరాబాద్: 28°C
వార్తలు

థాయ్ భక్తుడిని ప్రశంసించిన మోదీ

'మన్ కీ బాత్'లో PM మోదీ థాయ్‌లాండ్‌కు చెందిన పంథౌన్ తిరఖానోన్ అనే గణేషుని భక్తుడిని ప్రశంసించారు. అక్కడ వినాయకుడిని 'ఫ్రా పికానెట్'గా కొలుస్తారన్నారు. 19 ఏళ్ల వయసులో తండ్రి ఇచ్చిన గణేషుని ఫొటోతో ఆయనలో భక్తి మొదలైందని, 40 ఏళ్లుగా వినాయకుడి సంప్రదాయాలపై అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. 2002లో ఆయన ఏర్పాటు చేసిన మ్యూజియంలో 10 వేలకు పైగా గణేష విగ్రహాలు ఉన్నాయన్నారు.