హైదరాబాద్: 28°C
వార్తలు

ముంబై, ఢిల్లీ దాడులను గుర్తుచేసిన ప్రధాని

ప్రధాని మోదీ 138వ 'మన్ కీ బాత్'లో ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఒకప్పుడు దేశంలో వరుస పేలుళ్లు సాధారణంగా జరిగేవి. 2008లో ఢిల్లీ, ముంబై దాడుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ఉగ్రదాడి తర్వాత పాక్‌పై కఠిన చర్యలకు డిమాండ్లు వచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ నేటి నవ భారతం ఉగ్రవాదం పట్ల 'జీరో టాలరెన్స్' విధానంతో ముందుకెళ్తోంది' అని మోదీ స్పష్టం చేశారు.